‘ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు’
KRNL: సీ. బెళగల్ మండలంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఏవో జీ. మల్లేష్ కుమార్ తనిఖీ చేశారు. కిసాన్ మాల్, మన గ్రోమోర్ సెంటర్‌ను సందర్శించి, ఎరువు, పురుగు మందులను, పలు రిజిస్టర్లను పరిశీలించారు. అందులో ఎరువులు, పురుగు మందులను పరీక్ష నిమిత్తం శాంపుల్స్ తీశారు. ఈ నమూనాలను గుంటూరు, తిరుపతి ల్యాబ్‌లకు పంపుతున్నట్లు ఆయన తెలిపారు.