అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: తలసాని

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: తలసాని

HYD: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల మహిళలు, యువతులు, బ్రహ్మకుమారీలు వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన కార్యాలయానికి చేరుకుని రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించి తమ ప్రేమ, గౌరవాన్ని చాటుకున్నారు.