అన్నవరం సత్యదేవుని అన్నదాన ట్రస్ట్‌కు భారీ విరాళం

KKD: శంఖవరం మండలం అన్నవరం సత్యదేవుని నిత్య అన్నదానం పథకానికి శనివారం హైదరాబాద్ వాస్తవ్యులు కేవీపీ బాపన్న స్వామి వారికి 1,00,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. ముందుగా దాతలు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు ఆయనకు అందజేశారు.