కొబ్బరి తోటలను పరిశీలించిన DY.CM పవన్
కోనసీమ: జిల్లాలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పరిధిలోని దెబ్బతిన్న కొబ్బరి తోటలను DY.CM పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి 45 రోజుల్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మళ్లీ వస్తానని హామీ ఇచ్చారు. అలాగే, పంట నష్ట నివారణపై జిల్లా అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.