రైతులకు యూరియా పంపిణీ
NLR: పొదలకూరు మండలం బిరదవోలు రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతులకు అధికారులు, టీడీపీ నాయకులు యూరియా పంపిణీ చేశారు. తెలుగు యువత మండల అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లపల్లి, చెర్లోపల్లి, బిరదవోలు, కళ్యాణపురం, ముత్యాలపేట, బ్రాహ్మణపల్లి గ్రామాల రైతులకు 400 బస్తాలు యూరియా పంపిణీ చేశామని చెప్పారు.