'ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించాలి'
ADB: ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ అన్నారు. సోమవారం ఉట్నూర్ పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆదివాసి గిరిజన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.