విచారణకు హాజరైన అనంతబాబు భార్య
AP: కాకినాడలోని SDPO కార్యాలయంలో SIT ఎదుట రెండో రోజు అనంతబాబు భార్య విచారణకు హాజరయ్యారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో లక్ష్మీదుర్గ అలియాస్ రోజాను విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ1 అనంతబాబు, ఏ2 లక్ష్మీదుర్గ ఉన్నారు. సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి SDPO మనీశ్ పాటిల్ దేవరాజ్ ఉన్నారు.