పరిగిలో అనాథ బిడ్డలకు ఎంపీ ఆర్థిక సహాయం
SS: పరిగి మండల కేంద్రానికి చెందిన టీడీపీ కార్యకర్త భజంత్రి గోపాల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఎనిమిదేళ్ల క్రితం భార్యను కోల్పోయారు. అనాథలైన ఇద్దరు ఆడబిడ్డ పిల్లలను హిందూపురం ఎంపీ బీకే. పార్థససారథి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చదువు ఆపకుండా ముందుకు వెళ్లాలని వారికి సూచించారు.