'సీపీఐ నాయకునిపై దాడి చేసినవారిని శిక్షించాలి'

KDP: పుల్లంపేట మండలం సీపీఐ నాయకులు సెల్వకుమార్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పుల్లంపేటలో దాడికిగురైన సెల్వకుమార్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దోషులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. తొమ్మిది నెలల గర్భవతిపై దాడిచేయడం శోచనీయమన్నారు.