మహమ్మదాబాద్‌లో చోరీ.. కార్డు మార్చి రూ. 28,500 మాయం
MBNR: మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ATM కార్డు మార్పుతో రూ.28,500 మోసపోయిన ఘటన చోటుచేసుకుంది. లింగయ్యపల్లి తండాకు చెందిన కాట్రావత్ రేణుక అక్టోబర్ 8న ATMలో డబ్బులు తీసుకునేందుకు వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తి డబ్బులు ఇచ్చి కార్డు మార్చాడు. అదేరోజు ఆమె ఖాతా నుంచి రూ. 28,500 తీసుకున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.