ఓయూలో మాజీ ఎమ్మెల్యే ఆర్ల వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు

HYD: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బీఅర్ఎస్వీ విద్యార్థి నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆళ్ల వెంకటేశ్వర్లు కీలకపాత్ర వహించారు అన్నారు.