VIDEO: ముసీనదిలో గల్లంతు అయిన చిన్నారి మృతదేహం లభ్యం

VIDEO: ముసీనదిలో గల్లంతు అయిన చిన్నారి మృతదేహం లభ్యం

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని సోమప్ప సోమేశ్వర దేవాలయం వద్ద మూసీ నదిలో సోమారం గ్రామానికి చెందిన కొమర్రాజు సుస్మిత ( 12) గల్లంతు అయిన విషయం తెలిసిందే. స్థానిక ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో రిస్క్ టీమ్, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇవాళ కిలోమీటర్ దూరంలో బూర్గుల తండ దగ్గర మృతదేహం లభ్యమైనది. పోలీసులు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.