'పీఎం కర్మయోగి యోజన – సమర్థ పాలనకు పునాది'

'పీఎం కర్మయోగి యోజన – సమర్థ పాలనకు పునాది'

E.G: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సమర్ధవంతంగా విధులు నిర్వహించడానికి “పీఎం కర్మయోగి యోజన” కీలకమని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం నియమం ఆధారిత పాలన నుంచి పాత్ర ఆధారిత పాలన వైపు దారితీస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజా సేవా స్ఫూర్తిని పెంపొందిస్తోందన్నారు.