గణేష్ గడ్డ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

గణేష్ గడ్డ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

SRD: పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయంను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు.