కలెక్టరేట్ రహదారి సమీపంలో శానిటేషన్‌పై జిల్లా కలెక్టర్ తనిఖీ
కామారెడ్డి కలెక్టరేట్ రహదారి సమీపంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శానిటేషన్ వ్యవస్థను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసర ప్రాంతాల్లో శుభ్రత, చెత్త నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థలపై దృష్టి సారించి, రోడ్డు పక్కన చెత్త, నీటి నిల్వలను పరిశీలించారు. సంబంధిత మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సానిటేషన్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.