రోడ్డుకు మరమ్మతులు చేయండి సారూ..!
NRPT: మద్దూరు మండలంలోని పల్లెర్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ కోస్గి, నందిపాడు గ్రామాలకు వెళ్లే వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నామని వాపోయారు. ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి వెంటనే గుంతలను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.