బాగ్ లిహార్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

జమ్మూలో బాగ్ లిహార్ ప్రాజెక్టు గేట్లు మరిన్ని ఎత్తారు. చీనాబ్ నది నీటిమట్టం పెరగడంతో గేట్లను అధికారులు ఎత్తివేశారు. భద్రతా చర్యల్లో భాగంగా గేట్లు ఎత్తినట్లు అధికారులు తెలిపారు. ఇది చీనాబ్ నదిపై రన్-ఆఫ్-ది-రివర్ పవర్ ప్రాజెక్టుగా ఉంది. కాగా, మే 8న రెండు గేట్లు తెరిచిన విషయం తెలిసిందే.