ఘనంగా 45వ పీఠాధిపతి జయంతి వేడుకలు
KRNL: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 45వ పీఠాధిపతి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారితో పాటు మొదటి పీఠాధిపతి ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించారు. పసుపు, చందనం వంటి లేపనాలు సమర్పించి.. ధూప దీపాలతో మహా మంగళహారతి అందించారు.