VIDEO: కరీంనగర్‌లో యువత సంబరాలు

KNR: జిల్లాలో అర్ధరాత్రి ఇండియా ప్రపంచ కప్ టీ20 గెలవడంతో యువతీయువకులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని రహదారుల వెంబడి యువకులు బైక్ రైడ్ చేస్తూ జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు తెలంగాణ చౌక్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. 17 సంవత్సరాల తర్వాత రోహిత్ సేన కప్పు గెలవడంపై యువత హర్షం వ్యక్తం చేశారు.