ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భూకంపం
ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. ఆ దేశంలోని దరవాన్ కేంద్రంగా ఈ భూకంపం వచ్చింది. మరోవైపు భారత్‌లోని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, కార్గిల్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్వల్ప తీవ్రత ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారుల వెల్లడించారు.