'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

MNCL: దండేపల్లి మండలం రాజంపేట గ్రామంలోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, వేసవి దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.