పాము కాటుతో బాలుడు మృతి

పాము కాటుతో బాలుడు మృతి

NRPT: మక్తల్ మండలం కర్నే గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం రంజాన్ సెలవు కావడంతో స్నేహితులతో ఆడుకుంటున్న చరణ్(9) అనే బాలుడు ఇంటి పక్కన ఉన్న చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళగా పాము కాటుకు గురయ్యాడు. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందాడు. కుటుంబానికి ఈ ఘటన తీరని లోటు మిగిల్చింది.