తల్లిని హత్య చేసిన కుమార్తెలు

AKP: సబ్బవరం(M) బాటజంగాలపాలెంలో ఆగస్టు 14న లభ్యమైన మహిళా మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ తగాదాల కారణంగా మృతురాలి సొంత కుమార్తెలే బాబాయి ప్రోత్సాహంతో తల్లిని హత్య చేసినట్టు విచారణలో తేలింది. విశాఖ జిల్లా వడ్లపూడిలో ఇంట్లోనే హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని బాటజంగాలపాలెం తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు.