VIDEO: కార్యకర్తలకు భరోసా.. "ఏ కష్టమొచ్చినా నేనున్నా!"
E.G: TDPకి కార్యకర్తలే వెన్నుముక అని, వారికి ఎప్పుడూ .. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ధవలేశ్వరంలో మంగళవారం ఆయన పర్యటించి, మృతులు కరణం రామారావు, పి.మాణిక్యాలరావు, కేతమల్ల వెంకటేశ్వరరావు కుటుంబాలకు CM సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటామని MLA హామీ ఇచ్చారు.