పశువులకు LSD వ్యాధి నివారణకు టీకాలు

సత్యసాయి : బత్తలపల్లిలో పశువులకు ముద్ద చర్మపు వ్యాధి నివారణకు(లంపి స్కిన్ డిసీజ్) టీకాలు వేస్తున్నట్లు వెటర్నరీ ఏడి శ్రీనివాసులు వైద్యాధికారి గుర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ వ్యాధి అంటువ్యాధి, ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి అన్నారు. చర్మంపై, శరీరంలోని ఇతర భాగాలపై నాడ్యూల్స్ కలిగి ఉంటుందని, వ్యాధి సోకిన పశువులకు జ్వరం, తదితర లక్షణాలు ఉంటాయన్నారు.