‘వెల్మకన్నె గ్రామాభివృద్ధిలో నర్సింహ సేవలు మరువలేనివి’

‘వెల్మకన్నె గ్రామాభివృద్ధిలో నర్సింహ సేవలు మరువలేనివి’

NLG: గట్టుప్పల్ మండ‌లం వెల్మకన్నె గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగ‌త‌ బట్టపోతుల నర్సింహ సేవలు మరువలేనివ‌ని గ్రామస్తులు కొనియాడారు. నర్సింహ 4వ వర్ధంతి సందర్భంగా వెల్మకన్నె చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి బుధవారం పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో దళితులకు కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇప్పించడంలో నర్సింహ కృషి చేశారన్నారు.