మన్మోహన్ సింగ్‌కి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

NZB: మాజీ ప్రధాని Dr. మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించటంతో శుక్రవారం బోధన్‌లో అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి ఆర్థిక రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేమని అన్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రముఖులు గంగా శంకర్, హరికాంత్ చారి, దాము హనుమంతరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.