ఇకపై వారానికి రెండు రోజుల సెలవులు

ఇకపై వారానికి రెండు రోజుల సెలవులు

చమురు కొరత నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజుల పాటు అధికారిక సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని బాలేన్ షా నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్రోల్, డీజిల్ సంక్షోభం తగ్గే వరకు ఈ సెలవులు ఉంటాయని మంత్రివర్గం వెల్లడించింది. ఈ సెలవులు విద్యా సంస్థలకూ వర్తిస్తాయని చెప్పింది.