'పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి'

'పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి'

NRPT: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం ఊట్కూరు మండలం పెద్దజట్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పక్కనే ఒక చిన్న రేకుల షెడ్లో మధ్యాహ్న భోజనానికి వంట చేయడం చూసి అసహనం వ్యక్తం చేశారు. వంట గది మార్చాలని ఆదేశించారు.