'నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

'నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

MNCL: నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. జన్నారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం ఆయన అందజేశారు. వివిధ రోగాలతో బాధపడుతూ సరైన చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.