370 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త

370 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త

సత్యసాయి: జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 370 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ కార్యకర్తలుగా పారదర్శకంగా అప్‌గ్రేడ్ చేసినట్లు పీడీ ప్రమీలా రాణి మంగళవారం తెలిపారు. కమిటీ ఆదేశాలు, అర్హతల ప్రకారం నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. అప్‌గ్రేడేషన్ కోసం డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.