సీతారామపురం పీఏసీఎస్ నూతన చైర్మన్ నియమకం
W.G: నరసాపురం మండలం సీతారామపురం పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా ఇటీవల కలవకొలను వీరాస్వామి నియమితులయ్యారు. వీరాస్వామి ఐదవ సారి ఈ పదవిని చేపట్టనున్నారు. తాతాజీతో పాటుగా కమిటీ సభ్యులుగా దొంగ శ్రీరామ చంద్రుడు, యర్రంశెట్టి మావులయ్యలు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ రుణాలు మంజూరు చేయడంలో కృషి చేస్తానని వీరాస్వామి తెలిపారు