కామారెడ్డి ప్రజావాణికి 87 దరఖాస్తులు
KMR: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవాళ నిర్వహించిన ప్రజావాణికి 87 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా పాలనాధికారి, అదనపు కలెక్టర్‌లు విక్టర్, మదన్ మోహన్, వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.