'స్టేడియంను ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా మార్చాలి'

'స్టేడియంను ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా మార్చాలి'

హైదరాబాద్‌లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఉన్నత స్థాయి స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంను ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా మార్చే దిశగా ప్రతిష్టాత్మక కార్యాచరణ ప్రణాళికను సీఎం వివరించారు. స్టేడియంలో బిగ్ స్క్రీన్స్ లాంటివి ఏర్పాటు చేయాలన్నారు.