'లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'
PDPL: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి డాక్టర్ టీ. శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. జిల్లా అదనపు న్యాయ స్థానంలో లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పలు కేసుల్లో నిందితులు రాజీ కుదుర్చుకునేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు, పోలీసు శాఖ అధికారులున్నారు.