ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: బాల చైతన్య స్ఫూర్తి 14వ వార్షికోత్సవ ఆటల పోటీలను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఈ ఆటల పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జగ్గయ్యపేట క్రీడాకారులు రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.