కాకర్లపహాడ్‌లో హనుమాన్ జయంతి వేడుకలు

కాకర్లపహాడ్‌లో హనుమాన్ జయంతి వేడుకలు

MBNR: నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌లో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్తులు హనుమాన్ ఆలయాన్ని పూలతో శోభాయమానంగా అలంకరించి, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.