బైకును ఢీకొన్న కారు.. ఒకరి పరిస్థితి విషమం

బైకును ఢీకొన్న కారు.. ఒకరి పరిస్థితి విషమం

NLG: కట్టంగూరు మండలం ఐటిపాముల వద్ద జాతీయ రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు అతివేగంగా బైకును ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, వెంటనే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.