బాల్య వివాహ రహిత గ్రామంగా బ్రాహ్మణపల్లి

బాల్య వివాహ రహిత గ్రామంగా బ్రాహ్మణపల్లి

PDPL: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 'ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక'లో భాగంగా బాలల పరిరక్షణపై అవగాహన సదస్సు సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బీ.చందన హాజరై మాట్లాడారు. బాల కార్మికులు, డ్రాస్అవుట్స్, చైల్డ్ ట్రాఫికింగ్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాన్ని బాల్య వివాహ రహితం గ్రామంగా ప్రకటించారు.