యూరియా కొరత ఏర్పడకుండా చూడాలి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా మండలాల వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, స్టాక్ పూర్తిగా అయిపోకముందే ఉన్నతాధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి కలెక్టర్ కార్యలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్‌తో కలిసి అన్ని మండలాల ఎంఏవోలు, ఏఈవో లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.