నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: ప్రత్తిపాడు సబ్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. సబ్‌స్టేషన్ పరిధిలో పాడైపోయిన 11 కేవీ ఫీడర్ బ్రేకర్ స్థానంలో కొత్త బ్రేకర్ ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ సాంబశివరావు తెలిపారు. ఈ మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.