సీఐఐ సదస్సుతో నిరుద్యోగ సమస్య దూరం
VSP: విశాఖలో రెండు రోజులపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుతో ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోందని VMRDA ఛైర్మన్ ఎం. ప్రణవ్ గోపాల్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతరలా వస్తున్న పెట్టుబడులతో భవిష్యత్తులో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దూరం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.