VIDEO: అల్లూరు మండలాన్ని కప్పేసిన మంచు దుప్పటి
NLR: వేసవికాలం వచ్చిన మంచు అస్సలు తగ్గట్లేదు. మార్చి నెల మొదటివారం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం విపరీతంగా మంచు కురిసింది. రోజు ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలు ఈ మంచు ప్రభావం వలన కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకపక్క మంచు, పచ్చని పొలాల మధ్య సూర్యోదయం అందరినీ ఆకట్టుకున్నది.