పాలకాయతిప్ప బీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన కలెక్టర్

పాలకాయతిప్ప బీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన కలెక్టర్

కృష్ణా: కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇవాళ కలెక్టర్ డీకే. బాలాజీ కుటుంబ సమేతంగా సందర్శించారు. అనంతరం, అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పొదిగించిన ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఈ సందర్భంగా ఇసుక తిన్నెల్లో తాబేళ్లు పెట్టిన గుడ్లను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.