నీటి గుంతలో పడి యువకుడు మృతి

నీటి గుంతలో పడి యువకుడు మృతి

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో గురువారం నాడు నీటి గుంతలో పడి యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బండల పాలిష్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న నీటి గుంతలో పడి చాంద్ భాషా అనే యువకుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.