VIDEO: 'మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం'
NLG: జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి కోమటి రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. జిల్లాలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. అలాగే నూతన ఆసుపత్రి భవన నిర్మాణం కూడా పిల్లర్ల స్థాయికి చేరుకుని వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.