ఆర్మీ వీర జవాన్ పార్థివదేహానికి ఎమ్మెల్యే నివాళులు

KMM: కారేపల్లి (M) సూర్యతండాకు చెందిన ఆర్మీ వీర జవాన్ బానోత్ అనిల్ కుమార్ విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. బుధవారం కారేపల్లి పోలీస్ స్టేషన్ నందు వీర జవాన్ పార్థివదేహానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పూలమాలతో నివాళులర్పించారు. వీర జవాన్ అనిల్ కుమార్ హఠాన్మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని MLA ప్రార్థించారు.