కదిరిలో నేడు ఆర్జిత కల్యాణోత్సవం
సత్యసాయి: కదిరిలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సోమవారం ఉదయం 10.45 గంటలకు కల్యాణ మండపంలో ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం ఆరుగంటలకు సాధారణ దర్శనం, నిత్య పూజా కార్యక్రమాలు, 7 నుంచి 9 గంటల మధ్య అభిషేకం, స్వర్ణకవచ సేవలు జరుగగా, భక్తులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు సర్వదర్శనం కల్పించనున్నారు.