సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి సాగు
HYD: నాచారంలో ఓ ఇంటి మేడపై గంజాయి సాగు కలకలం రేపింది. శశిధర్ రెడ్డి అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి సాగు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా 2 కుండీల్లో 17 గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు చిక్కాడు. మత్తుకు బానిసై సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.