VIDEO: అయ్యప్ప స్వామి పడిపూజలో ఎమ్మెల్యే బీర్ల
BHNG: శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం సోమవారం బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ కరకమలములచే యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, భజన కీర్తనలతో పడిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.